గుజరాత్ లో అదిరే ప్రమోషన్స్ కి ల్యాండ్ అయ్యిన “RRR” యూనిట్.!

గుజరాత్ లో అదిరే ప్రమోషన్స్ కి ల్యాండ్ అయ్యిన “RRR” యూనిట్.!

Published on Mar 20, 2022 12:59 PM IST

rrr 15
ప్రస్తుతం పాన్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ ప్రకారం దర్శకుడు రాజమౌళి మరియు హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ కి పయనం అవుతున్నారు.

మరి నిన్ననే కర్ణాటకలో భారీ ఈవెంట్ కి పాల్గొన్న చిత్ర యూనిట్ ఇప్పుడు గుజరాత్ లో ప్రమోషన్స్ కి ల్యాండ్ అయ్యారు. ఈ క్రేజీ ట్రయో రాజమౌళి, రామ్ చరణ్, రామారావు లు ల్యాండ్ అయ్యిన ఫోటోలు వైరల్ కాగా ఈ ప్రోగ్రాం కి గాను అక్కడి యూనిట్ ఏకంగా “RRR” స్టిక్కర్స్ తో పలు కార్లను రోడ్ షో నిమిత్తం రెడీ చెయ్యడం మరింత ఆసక్తిగా మారిపోయింది.

దీనితో ఇక్కడ కూడా ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ అదరగొడుతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు నటించగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. అలాగే కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు