కళ్ళు చెదిరే ధరకు “RRR” నార్త్ హక్కులు.!

Published on Apr 2, 2021 9:00 am IST

ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఉన్న పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తీస్తున్న “రౌద్రం రణం రుధిరం” సినిమా ఖచ్చితంగా టాప్ లో ఉంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియడానికి దీనికి జరుగుతున్న బిజినెస్ లెక్కలు బట్టే చెప్పొచ్చు.

కేవలం తెలుగు తమిళ్ సహా ఓవర్సీస్ హక్కుల రేట్ లు విన్నప్పుడే ఒక్కొక్కరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. మరి లేటెస్ట్ గా నార్త్ సహా ఎలక్ట్రానిక్ అన్ని భాషల డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ వారు ఎంత చెల్లించారో ఇప్పుడు తెలుస్తుంది. మన ఇండియా లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాకు కూడా ఇవ్వని సాలిడ్ ఫిగర్ ఇచ్చారట.

ఏకంగా 500 కోట్లు ఈ సినిమా ఒక్క నార్త్ హక్కులకు వారు చెల్లించినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం సెన్సేషనే అని చెప్పాలి. దీనిని బట్టి ఈ చిత్రం అన్ని సెట్టయ్యి ఒక్క హిందీలోనే ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో కూడా మనం అర్ధం చేసుకోవాలి. అలాగే ఓవరాల్ గా ఈ చిత్రం 800 కోట్లకు పైగానే బిజినెస్ జరిపినట్టు టాక్..

సంబంధిత సమాచారం :