వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర పనులు !

వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర పనులు !

Published on Jun 25, 2018 8:14 PM IST

‘బాహుబలి’ ఘన విజయం తరువాత రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ తెరకెక్కించనున్నాడనే సంగతి తెలిసిందే. డి వి వి ఎంటెర్టైన్మ్నెట్స్ పతాకం ఫై దానయ్య డి వి వి నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులను వచ్చే నెలలో మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్స్ ను నిర్మించనున్నారు. మాములుగా రాజమౌళి తన సినిమాకు సంభందించిన సెట్టింగ్స్ ను స్టూడియోలో వేస్తుంటారు. కానీ ఈసారి ఒక ప్రైవేట్ ప్లేస్ ను లీజుకు తీసుకొని మరీ ఈ చిత్రం యొక్క భారీ సెట్టింగ్స్ ను అక్కడ వేయడానికి రెడీ అవుతున్నాడట .

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , రాశీ ఖన్నా లను కథానాయికలు గా తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి పేర్లు కూడా ఆర్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుండడంతో ఈ సినిమాలో నటించే హీరోయిన్లు వీరే అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఫై ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుండగా, రామ్ చరణ్ తన 12వ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేసి రాజమౌళి సినిమాలో జాయిన్ కానున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు