RRR: జక్కన టీం జార్జియాకు వెళ్లనుందట?

RRR: జక్కన టీం జార్జియాకు వెళ్లనుందట?

Published on Jul 17, 2021 10:50 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం ప్రమోషన్ కారక్రమాలపై దృష్టి పెట్టిన చిత్ర యూనిట్ ఇటీవల మేకింగ్ వీడియోని రిలీజ్ చేసి రికార్డులు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే జక్కన టీం ఓ పాట చిత్రీకరణ కోసం త్వరలోనే యూరప్ వెళ్లనున్నారని తెలుస్తుంది. ఈ పాట రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల మీదే ఉండనున్నట్టు తెలుస్తుంది. జార్జియాలోని పలు ప్రాంతాల్లో ఈ పాట షూటింగ్ జరగబోతుందని, ఈ నెల చివరి వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభం అవ్వనున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ప్రస్తుతానికైతే ఇటు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమోషనల్ వీడియో సాంగ్ చిత్రీకరణలో జక్కన్న టీం బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు