‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభం !

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభం !

Published on Nov 19, 2018 10:09 AM IST

స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్ ) మొదటి షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లో ఈ షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ‘బాహుబలి’ చిత్రం తో దేశ వ్యాప్తంగా గుర్తింపు ను తెచ్చుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సుమారు 200కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు