భారీ ధరకు “RRR” తమిళ్ హక్కులు.?

భారీ ధరకు “RRR” తమిళ్ హక్కులు.?

Published on Feb 16, 2021 3:00 PM IST

RRR 3

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం శరవేగంగా సరైన సీన్స్ ను షూట్ చేసుకుంటుంది.

ఇక ఇదే సమయంలో ఈ భారీ సినిమా బిజినెస్ పరంగా కూడా పలు ఆసక్తికర టాకే వినిపిస్తూ వస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ మార్కెట్ లో భారీ ఎత్తున బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం తమిళనాట బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది అని ఓ టాక్ ఊపందుకుంది.

ఇంతకు ముందు చెప్పినట్టుగానే అక్కడి భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు సాలిడ్ ఫిగర్ ఇచ్చి ఈ చిత్రం తాలూకా హక్కులను కొనుగోలు చేసినట్టుగా వినికిడి. అది కూడా 40 కోట్లకు పైగానే జరిగినట్టు అంటున్నారు. మొత్తానికి మాత్రం ఈ భారీ చిత్రం సాలిడ్ బిజినెస్ జరుపుకుంటుంది.మరి దీనిపై మరింత సమాచారం రావల్సి ఉంది. ఇక అక్టోబర్ 13న ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు