వికారాబాద్ లో ‘రుద్రమదేవి’ షూటింగ్

Rudhramadevi
ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చారిత్రిక సినిమాల్లో ‘రుద్రమదేవి’ ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ ఈ రోజు రానా దగ్గుబాటి, మరికొంతమంది నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు. గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో భారీ భారీ సెట్స్ కోసం, అవి రియలిస్టిక్ గా ఉండడం కోసం భారీగా కర్చు పెడుతున్నాడు.

ఈ తొలి చారిత్రాత్మక 3డిసినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క కనిపించనుంది. అలాగే గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Exit mobile version