ఆగష్టులో రుద్రమదేవి ట్రైలర్ ?

Rudhramadevi
అనుష్క త్వరలో కాకతీయ సామ్రాజ్యపు రాణి అయిన రుద్రమదేవిగా ‘రుద్రమదేవి’ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా సెట్ లో నగలు దొంగతనానికి గురైన కారణంగా ఇటీవలే ఈ చిత్రం వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో వుంది.

ఈ చిత్రం మొదటి ట్రైలర్ ని ఆగష్టులో విడుదలయ్యే అవకాశాలు వున్నాయని సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న క్లూ ని దర్శకుడు ఇవ్వకపోవడంతో ఈ ట్రైలర్ అన్ని ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుందని భావిస్తున్నారు

ఈ రుద్రమదేవి 3D సినిమా భారీ బడ్జెట్ తో, ఇండస్ట్రీలో పలువురు ప్రధాన తారాగణంతో సాగుతుంది. అల్లు అర్జున్ ముఖ్య పాత్రధారి. రానా దగ్గుబాటి రాజు పాత్ర పోషించాడు

రుద్రమదేవి సినిమాకు దర్శకత్వ మరియు నిర్మాణ బాధ్యతలను గుణశేఖర్ నిర్వహిస్తున్నారు

Exit mobile version