‘రుద్రమదేవి’ నైజాం కలెక్షన్స్!

rudhramadevi
గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ అక్టోబర్ 9న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రాణీ రుద్రమదేవి లాంటి వీరవనిత చారిత్రక కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ కనిపించిన క్రేజ్‌కి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించి హిట్‌గా నిలిచింది.

అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ముఖ్యంగా నైజాం ఏరియాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. దసరా సెలవులు కావడం, చారిత్రక నేపథ్య కథ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి కనబరచడం వంటి విషయాలు రుద్రమదేవికి నైజాంలో బాగా కలిసివచ్చాయి. ఇక ఈ దసరా వారం కూడా నైజాంలో రుద్రమదేవి కలెక్షన్స్ బాగున్నాయని ట్రేడ్ టాక్. ఇప్పటివరకూ 17 రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 20 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషంగా కనిపిస్తోంది.

ఒక చారిత్రక కథను ప్రేక్షకులకు చేరవేయాలన్న గుణశేఖర్ ఆలోచనకు, అల్లు అర్జున్, అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా అయిన రుద్రమదేవి, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదలైంది.

Exit mobile version