‘రుద్రమదేవి’ స్పెషల్ : త్వరలో అల్లు అర్జున్ మేకింగ్ వీడియో

‘రుద్రమదేవి’ స్పెషల్ : త్వరలో అల్లు అర్జున్ మేకింగ్ వీడియో

Published on Jan 8, 2015 12:02 PM IST

allu-arjun-rudhrama-devi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా బందిపోటు పాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. త్వరలో అల్లు అర్జున్ మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నట్టు ‘రుద్రమదేవి’ మూవీ టీం తెలిపింది. ఇప్పటికే విడుదలైన అర్జున్ ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అర్జున్ సరసన కాథరిన్ త్రేసా నటించింది.

అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాను శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్‌ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తోట తరణి కళా దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ త్రిడి సినిమాగా ‘రుద్రమదేవి’ చరిత్రకెక్కింది.

తాజా వార్తలు