రుద్రమదేవి.. ౩డీ సినిమాల్లో సరికొత్త అనుభూతి!

రుద్రమదేవి.. ౩డీ సినిమాల్లో సరికొత్త అనుభూతి!

Published on Jul 9, 2015 10:27 PM IST

RUDRAMA-DEVI
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’. భారతదేశపు మొట్టమొదటి ౩డీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోతో సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‍గా నిలవనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా, ౩ డీ పనుల్లో జాప్యం కారణంగా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ చివరిదశకు చేరడంతో త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇక ఈ సినిమాకు ఎన్‌హాన్స్‌డ్ డెప్త్ సొల్యూషన్స్ (ఈడీఎస్) అనే టెక్నాలజీని వాడడం విశేషంగా కనిపిస్తోంది. ఈ టెక్నాలజీతో ౩డీలో ఈ సినిమాను చూడడానికి ఎటువంటి అద్దాలను (౩డీ అద్దాలు) వాడాల్సిన అవసరముండదు. ఇదిలా ఉంటే.. చిరంజీవి వాయిస్ ఓవర్‍తో మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుందని గుణశేఖర్ నమ్మకంగా ఉన్నారు.

తాజా వార్తలు