అనుష్క ‘రుద్రమదేవి’ రిలీజ్ డేట్.?

అనుష్క ‘రుద్రమదేవి’ రిలీజ్ డేట్.?

Published on Jul 21, 2015 6:15 PM IST

RUDRAMA-DEVI
టాలీవుడ్ లో బాహుబలి లాంటి భారీ బడ్జెట్ పీరియాడికల్ సినిమా తర్వాత రానున్న మరో పీరియాడికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా చేసుకొని భారీ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని తీసాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న యోగ బ్యూటీ అనుష్క రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. గత 8 నెలలుగా ఈ చిత్ర టీం 3డి గ్లాసెస్ లేకుండా 3డి సినిమాని చూపించే దానిమీద వర్క్ చేస్తున్నారు.

ఈ కారణం వల్లే సినిమా పలుసార్లు వాయిదా పడింది. కానీ మరో వారం రోజులతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి కానుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్ర టీం పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. మాకు అందిన విశ్వసనీయ వర్గాల ప్రకారం ఎక్కువ భాగం సెప్టెంబర్ 4న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో ఇదే విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు