ఫిబ్రవరి 28న ‘రుద్రమదేవి 3డి’ ట్రైలర్ ప్రీమియర్

ఫిబ్రవరి 28న ‘రుద్రమదేవి 3డి’ ట్రైలర్ ప్రీమియర్

Published on Feb 24, 2015 9:21 AM IST

Rudramadevi
ఓరుగల్లు ఘనతను చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా ప్రసతుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చాలా రోజుల నుంచి ఈ చిత్ర టీం ఇదిగో ట్రైలర్ అదిగో ట్రైలర్ అని ప్రేక్షకులను ఊరించినా ట్రైలర్ ని మాత్రం రిలీజ్ చెయ్యలేదు. తాజాగా ఈ చిత్ర టీం ఫిబ్రవరి 28న ఈ ట్రైలర్ ప్రీమియర్ ని ప్లాన్ చేస్తున్నారు. చివరి సారి అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యలేకపోయినందుకు బాధపడుతూ ఫిబ్రవరి 28న రుద్రమదేవి ట్రైలర్ ప్రీమియర్ వేస్తున్నాం అని, ఆ ప్రీమియర్ కి ఎలా హాజరు కావాలనేది ఈ రోజు సాయంత్రం చెబుతాం అని ఈ చిత్ర టీం తెలియజేసింది.

ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. గత సంవత్సరం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు