‘రుద్రమదేవి’ టాక్స్ ఎత్తివేతకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కెసిఆర్

‘రుద్రమదేవి’ టాక్స్ ఎత్తివేతకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కెసిఆర్

Published on Oct 8, 2014 5:00 PM IST

Rudhramadevi
భారీ బడ్జెట్ మరియు భారీ సెట్స్ స్పెషలిస్ట్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్ట మొదటి స్టీరియో స్కోపిక్ 3డి పీరియాడిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ టాక్స్ మినహాయింపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని కలిసారని ఇది వరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం కెసిఆర్ ‘రుద్రమదేవి’ సినిమాకి ఎంటర్ టైన్మెంట్ టాక్స్ ని మినహాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీని ప్రకారం రుద్రమదేవి సినిమా ఎంటర్టైన్మెంట్ టాక్స్ లేకుండా రిలీజ్ కానుంది. ఈ విషయంలో హ్యాపీగా ఉన్న గుణశేఖర్, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆంధ్రలో కూడా ఎంటర్టైన్మెంట్ టాక్స్ ని తన సినిమాకి రద్దు చేయాలని కోరనున్నాడు.

అనుష్క రుద్రమదేవిగా కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్యవీరభద్రుడిగా రానా కనిపిస్తాడు. అలాగే అల్లు అర్జున్ గోనగాన్నారెడ్డి పాత్రలో కనిపిస్తాడు. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి తోట తరణి అద్భుతమైన అలనాటి కట్టడాలని సెట్స్ గా రూపకల్పన చేసారు.

తాజా వార్తలు