హిందీ ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘రుద్రమదేవి’!

హిందీ ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘రుద్రమదేవి’!

Published on Oct 2, 2015 9:56 AM IST

rudramadevi
తెలుగులో ఈమధ్య కాలంలో ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూయించిన సినిమాల్లో ‘రుద్రమదేవి’ మొదటి స్థానంలో ఉంటుంది. రిలీజ్ ఇప్పుడూ అప్పుడూ అంటూ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని అక్టోబర్ 9వ తేదీకీ ఫిక్స్ అయింది. అయితే గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ సినిమాపై ఉన్న క్రేజ్ ఈ గ్యాప్‌లో తగ్గకపోగా మరింతగా పెరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీరియోస్కోపిక్ 3డీ పరిజ్ఞానంతో వస్తోన్న ఈ బయోపిక్ తెలుగుతో పాటు తమిళం, హిందీల్లోనూ ఒకేసారి విడుదల కానుంది.

ఇక తెలుగు, తమిళ ట్రైలర్స్ ఇప్పటికే విడుదల కాగా, నిన్న సాయంత్రం రుద్రమదేవి హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకూ విడుదలైన తెలుగు, తమిళ ట్రైలర్స్ కన్నా ఈ కొత్త హిందీ ట్రైలర్ మరింత ఆకర్షణగా నిలిచింది. తెలుగు ట్రైలర్‌తో పోలీస్తే కొత్త హిందీ ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా సినిమా మూడ్‌ను, చెప్పాలనుకున్న విషయాన్ని ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది.

చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ సినిమాపై కొత్తగా క్రియేట్ అయిన అంచనాలు, ఈ తాజా ట్రైలర్‌తో మరింతగా పెరిగాయనే చెప్పాలి. అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే విజువల్ ఫీస్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు