‘రుద్రమదేవి’ అక్టోబర్ 9కి ఫిక్స్ అయ్యిందా.?

‘రుద్రమదేవి’ అక్టోబర్ 9కి ఫిక్స్ అయ్యిందా.?

Published on Aug 31, 2015 9:28 PM IST

rudhramadevi-(1)
టాలీవుడ్ లో పీరియాడికల్ ఫిల్మ్స్ కరువైపోయిన సమయంలో ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ అని, గుణశేఖర్ ‘రుద్రమదేవి’ అంటూ ఒకేసారి రెండు పీరియడ్ ఫిల్మ్స్ మొదలయ్యాయి. అందులో బాహుబలి ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిపోవడంతో అందరి చూపు రుద్రమదేవి పైకి షిఫ్ట్ అయ్యింది. కానీ ఈ సినమా అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కచ్చితంగా సెప్టెంబర్ 4న రిలీజ్ చేసేస్తాం అనుకున్నా 3డి వర్క్ ఫినిష్ కాకపోవడం వలన, అలాగే రీసెంట్ గా ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చెయ్యాలని అనుకోవడంతో ఈ చిత్ర టీం సినిమాని వాయిదా వేసారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సారి ఎలాంటి వాయిదా ఉండకుండా సినిమాని పర్ఫెక్ట్ గా రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంతో కాస్త సమయం తీసుకుంటున్నారు. అన్ని భాషల డబ్బింగ్ వర్క్స్ తో పాటు, 3డి వర్క్ ని కూడా ఫినిష్ చేసి రుద్రమదేవి సినిమాని అక్టోబర్ 9న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్టోబర్ లో ఆ వీక్ చాలా ఖాళీగా ఉండడం, అలాగే దసరా సీజన్ కూడా కలిసొస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. మరి ఫైనల్ గా దీనికే ఫిక్స్ అవుతారో లేక మల్లె వనక్కి వేలుటారో తెలియాల్సి ఉంది. రుద్రమదేవిగా అనుష్క కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడుగా రానా, గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు