అల్లు శిరీష్ సరసన హీరోయిన్ ఆమేనా ?

అల్లు శిరీష్ సరసన హీరోయిన్ ఆమేనా ?

Published on Jun 1, 2018 10:56 AM IST

అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇందులో కథానాయకిగా రుక్సార్ మీర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఖచ్చితమైన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

‘ఆకతాయి’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రుక్సార్ మీర్ తాజాగా నాని ‘కృష్ణార్జున యుద్ధం’ తో మెప్పించింది. మరిప్పుడు వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్ ఆమేనా కాదా అనేది తేలాలంటే ఇంకొంత ఆగాల్సిందే. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతాన్ని అందివ్వనున్నారు.

తాజా వార్తలు