మహేష్ “సరిలేరు నీకెవ్వరూ”లో ఆయన నటించడం లేదా?

మహేష్ “సరిలేరు నీకెవ్వరూ”లో ఆయన నటించడం లేదా?

Published on Jul 16, 2019 1:23 PM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్,రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం “సరిలేరు నీకెవరూ”. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్ లో మహేష్ పై ఆర్మీ మేజర్ కి సంబందించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

కాగా తాజాగా ఈచిత్రంలో నటిస్తున్న ఓ ప్రముఖ నటుడి గురించిన పుకారు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సీనియర్ హీరో జగపతిబాబు ఈ సినిమా నుండి తప్పుకున్నారట. జగపతి బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొన్ని అనివార్య కారణాల వలన ఆయన ఈ మూవీలో నటించ కూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే జగపతి బాబు పాత్రను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఐతే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది.

విజయశాంతి,రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో నటిస్తుండగా, దిల్ రాజు,అనిల్ సుంకర,మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు