స్టార్ కపుల్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్డ్.

Published on Sep 18, 2019 9:50 pm IST

ఈసారి బిగ్ బాస్ షో కి ప్రధాన ఆకర్షణ స్టార్ కపుల్ వరుణ్ సందేశ్, వితికా షేరు. గత రెండు ఎపిసోడ్స్ కి భిన్నంగా ఈ సీజన్లో ఒకప్పటి హీరో, హీరోయిన్ అయిన వరుణ్, వితిక దంపతులను హౌస్ లోకి పంపడం జరిగింది. హౌస్ వీరి ప్రవర్తన కూడా ఆసక్తికరమే. ఈ స్టార్ కపుల్ అప్పుడప్పుడు కొట్టుకుంటూ, తింటుకుంటూ, ప్రేమ పంచుకుంటూ ప్రేక్షకులకు బాగానే వినోదం పంచుతున్నారు. ఐతే బిగ్ బాస్ షో నిర్వహణ యాజమాన్యం వీరిద్దరికి మొత్తంగా కొంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిందని తాజాగా బయటికొచ్చిన వార్త.

పరిశ్రమ వర్గాలను బట్టి తెలుస్తున్న సమాచారం ప్రకారం స్టార్ యాజమాన్యం ఈ దంపతులకు సీజన్ మొత్తానికి కలిపి 28లక్షల పారితోషికం ఇస్తామని ఒప్పందం చేసుకొన్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి గాను రాహుల్, మహేష్, హిమజ ఎంపిక కావడం జరిగింది. వీరి ముగ్గురిలో ఒకరు వచ్చే వారం హౌస్ నుండి బయటకి వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More