నయనతార పెళ్లి పై మళ్ళీ పుకార్లు వైరల్ !

Published on Sep 28, 2020 8:23 pm IST

లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు ఉన్న క్రేజ్ మిడియమ్ రేంజ్ స్టార్ హీరోలకు కూడా లేదు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో నయనతార అంటే.. స్టార్ హీరోతో సమానం అన్నట్టు ఉంటుంది అక్కడి పరిస్థితి. రెమ్యునరేషన్ పెంచుతున్నా.. సినిమా ప్రమోషన్స్ కి రాకపోయినా.. నయనతారకు మాత్రం డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉంది తమిళంలో. అందుకే తమిళ్ మీడియా కూడా ఎప్పుడూ నయనతార మీద ఏదొక రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. దానికి తోడు నయనతార వ్యక్తిగత జీవితం కూడా వివాదానికి అవకాశం ఇవ్వడం.. మొత్తానికి నయనతార అనగానే ఆడియన్స్ కు కూడా ఒక అటెక్షన్ వచ్చేసింది.

అయితే తమిళ్ మీడియా ఈ క్రమంలోనే నయనతార పెళ్లి పై ముందు నుంచీ ఎప్పటికప్పుడు కథలుకథలుగా తప్పుడు వార్తలను రాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా నయనతార పెళ్లి పై మళ్లీ రూమర్స్ క్రియేట్ చేశారు. విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందని తమిళ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త తెగ హల్ చల్ చేస్తూ ఉందట. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఇప్పటికే నయనతారకు రెండు మూడు విఫలమైన ప్రేమ కథల ఉన్న కారణంగానే.. గత ఐదేళ్లుగా విఘ్నేష్ శివన్ తో పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు నయనతార ఎప్పుడో పెళ్లి చేసుకుంటుందో అప్పుడే ఈ రూమర్స్ అగుతాయోమో.

సంబంధిత సమాచారం :

More