సీనియర్ తమిళ దర్శకుడు బాలచందర్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెన్నై కావేరి హాస్పిటల్స్ యాజమాన్యం చెక్ పెట్టింది. గత రెండు రోజుల నుండి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలచందర్ ను సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేసిన విషయాన్ని 123తెలుగు.కామ్ తెలియజేసింది. ఆయన స్వర్గస్తులయ్యారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ వార్తలను కావేరి హాస్పిటల్స్ యాజమాన్యం ఖండించింది. బాలచందర్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని తెలియజేశారు. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తమిళ సినిమా ప్రముఖులు బాలచందర్ ను స్వయంగా పరామర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.


