బాలయ్య పాత్ర పై అప్పుడే ఊహాగానాలు

Published on Aug 21, 2019 10:52 am IST

నటసింహం బాలయ్య నిన్న తన అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎటువంటి ప్రకటన లేకుండానే సడన్ గా తను నటిస్తున్న నూతన చిత్రానికి సంబంచిధించిన లుక్ విడుదల చేశాడు. దీని వెనుక కారణం కూడా లేకపోలేదు, ప్రస్తుతం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర సెట్స్ లో ఉన్న బాలయ్యతో ఓ అభిమాని ఫోటో దిగి అది షేర్ చేశారు. దీనితో అనధికారికంగా బాలకృష్ణ లుక్ బయటకొచ్చేసింది. అందుకే చిత్ర యూనిట్ నిన్న బాలయ్య బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ఇక బాలయ్య లుక్ చూసిన అభిమానులు మూవీ కథపై ఆయన పాత్రపై అనేక ఊహాగానాలు అల్లేస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నారని, అందులో ఒకటి బిలియనీర్ గెట్ అప్ కాగా మరొకటి మాస్ అవతార్ ని చెప్పుకొంటున్నారు. ఇందులో నిజం ఎంతో కానీ వింటుంటే మాత్రం ఆసక్తికలుగుతుంది.

ఇక సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :