ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం నిజమైతే అల్లు అర్జున్ త్వరలోనే తన తొలి తమిళ సినిమాలో నటించబోతున్నాడు. చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ తనకు ఓ డైరెక్ట్ తమిళ సినిమాలో నటించాలని ఉందని తెలిపాడు. అప్పట్లో కొంతమంది తమిళ డైరెక్టర్స్ తో కథా చర్చలు కూడా జరిగాయి కానీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఒక ప్రముఖ దిన పత్రిక అల్లు అర్జున్ త్వరలోనే తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడని ప్రచురించడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ‘ఓకే ఓకే’, ఎస్.ఎం.ఎస్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కె.ఈ. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాజేష్ ప్రస్తుతం కార్తీ, కాజల్ నటిస్తున్న ‘అల్ ఇన్ అల్ అజుగు రాజ ‘ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అల్లు అర్జున్ స్పెయిన్ నుండి రాగానే తెలిసే అవకాశం వుంది. ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేదాని కంటే ముందు అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి సినిమాని పూర్తి చేయాల్సి ఉంది .
అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ పై వస్తున్న రూమర్స్?
అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ పై వస్తున్న రూమర్స్?
Published on Apr 1, 2013 11:40 PM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


