పుష్ప డిజిటల్ ప్రీమియర్ పై క్లారిటీ!

Published on Dec 22, 2021 8:20 am IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం థియేటర్ల లో విజయవంతం గా ప్రదర్శింప బడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మీక మందన్న ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించడం జరిగింది.

ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పుష్ప ది రైజ్ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రైమ్ వీడియో లోకి వస్తుంది అంటూ ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అగ్రిమెంట్ ప్రకారం సినిమా విడుదల అయిన నాలుగు నుండి ఆరు వారాల్లో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి జనవరి చివరి వారం లో ప్రేక్షకులకు అందుబాటులో కి రానుంది. దీని పై మరొకసారి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :