రాబోయే బడా సినిమాలపై అప్పుడే మొదలైన రూమర్స్.!

Published on Apr 10, 2021 3:08 pm IST

ఇప్పుడు మళ్ళీ దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఎలా మారుతున్నాయో తెలిసిందే. ఒక్కసారిగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో మళ్ళీ తీవ్ర ప్రభావం సినిమా మీదనే పడే దిశగా కనిపిస్తుంది. అయితే ఆ మధ్య కేసులు చాలా మేర తగ్గు ముఖం పట్టేసరికి మన టాలీవుడ్ లో కోకొల్లలుగా అనేక సినిమాలు విడుదల తేదీలు ప్రకటించేసాయి. అలా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో “వకీల్ సాబ్” వరకు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసాయి.

కానీ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందా అన్న ప్రశ్న మొదలయింది. జనం అయితే థియేటర్స్ వరకు వస్తున్నారు కానీ మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం కాని పరిస్థితి. దీనితో వచ్చే మే నుంచి ఉన్న బడా సినిమాలు వాయిదా పడడం ఖాయం అనే రూమర్స్ పాట ఇపుడు మొదలయ్యింది.

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” సహా బన్నీ “పుష్ప” కూడా వాయిదా పడతాయని గాసిప్స్ మొదలయ్యాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.. సో అప్పటి వరకు అవి జస్ట్ రూమర్స్ మాత్రమే అనుకోవాలి. అలాగే ఈ కరోనా ప్రభావం కూడా తగ్గాలి సినిమా గత స్థితికి రాకూడదు అని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :