‘ది ప్యారడైజ్’పై రోజుకో వార్త.. కాన్ఫిడెంట్‌గా నాని అండ్ టీమ్..!

‘ది ప్యారడైజ్’పై రోజుకో వార్త.. కాన్ఫిడెంట్‌గా నాని అండ్ టీమ్..!

Published on Feb 3, 2026 2:00 PM IST

The Paradise

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ఒక వైవిధ్యమైన లుక్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు మార్చి 26న రిలీజ్ చేయరని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. కానీ, తమ కథపై మేకర్స్ ఫుల్ ధీమాగా ఉండటమే ఈ పుకార్లకు కారణమని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తనదైన విజన్‌తో రూపొందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ‘ది ప్యారడైజ్’ మూవీపై వస్తున్న పుకార్లపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

తాజా వార్తలు