యంగ్ హీరో శర్వానంద్ లవర్ బాయ్ లుక్ లో, పూర్తి కామెడీ పాత్రలో కనిపించిన సినిమా ‘రన్ రాజా రన్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ మరియు విమర్శకుల నుంచి మంచి రేటింగ్స్ రావడంతో ఈ సినిమాకి వచ్చే క్రౌడ్స్ కూడా అధికమవుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోనే కాకుండా ఈ సినిమాకి యుఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంటోంది.
యుఎస్ లో ‘రన్ రాజా రన్’ ప్రీమియర్ షో కి $3,605, శుక్రవారం కేవలం $23,086 వసూలు చేసింది. కానీ మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ రివ్యూస్ వలన శనివారం రోజు ఎక్కువగా ఆడియన్స్ ని థియేటర్ కి రాబట్టుకొని $53,158 కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి మొత్తం రెండు రోజుల్లో $79, 849 అనగా 48.56 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. యుఎస్ బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్స్ బాగా వస్తుండడంతో ఈ చిత్ర టీం అంరో 20 సెంటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘మిర్చి’ సినిమా అందించిన వంశీకృష్ణ రెడ్డి – ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.


