వాయిదా పడిన శర్వానంద్ ‘రన్ రాజా రన్’ విడుదల.?

runrajarun

కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసి పేరుతెచ్చుకున్న శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ‘రన్ రాజా రన్’. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాని జూలై 11న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాలన్స్ ఉండడం వల్ల ఈ సినిమా రిలీజ్ ని జూలై ద్వితీయార్దానికి వాయిదా వేశారు. ఎక్కువ భాగం జూలై 18న సినిమాని రిలీజ్ చేసే విధంగా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

గతంలో ‘మిర్చి’ సినిమాని నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ లు ఈ సినిమాని నిర్మించారు. ‘ ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటూనే సర్ప్రైజింగ్ గా కూడా సాగుతుందని’ చిత్ర నిర్మాతలు అంటున్నారు. సుజీత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ఎక్కువభాగం హైదరాబాద్, గోవాలలో షూట్ చేసారు. శర్వానంద్ స్టైలిష్ లుక్ లో మొబైల్స్ దొంగగా కనిపించనున్న ఈ సినిమాతో సీరత్ కపూర్ హీరోయిన్ గా పరిచయం కానుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మధి సినిమాటోగ్రాఫర్.

Exit mobile version