ఆ రెండు జిల్లాల్లో ‘ఆర్ఎక్స్ 100’దూసుకుపోతుంది !

Published on Jul 23, 2018 1:30 pm IST

ఈ మధ్య కాలంలో ట్రైలర్ తో మెప్పించిన చిత్రం ఏదైనా ఉందంటే అది ‘ఆర్ ఎక్స్ 100’ మాత్రమే. సినిమా విడుదలైన తరువాత కూడా అంతే ఆసక్తిని క్రియేట్ చేసి కలెక్షన్స్ తో సెన్సేషన్ ను సృష్టిస్తుంది. నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటివరకు తెలుగు రాష్ట్రల్లో 11కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశ గా దూసుకుపోతుంది.

ఇక ఆంధ్ర లోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈచిత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 రోజు ఈ చిత్రం రూ.3,93,735 లక్షల షేరును కలెక్ట్ చేసి మొత్తంగా 56,59,049 లక్షల షేరును ఖాతాలో వేసుకుంది.కృష్ణ జిల్లాలో 11 రోజు ఈ చిత్రం రూ.4,11,636 షేరును అలాగే టోటల్ గా రూ.60,02,342 లక్షల వసూళ్లను రాబట్టింది.

ఇక ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ ‘లవర్’ చిత్రం కృష్ణ జిల్లాలో 3వరోజు రూ. 5,51,114షేరును ,టోటల్ గా 13,02,509 షేరును రాబట్టింది. అలాగే కార్తీ నటించిన ‘చినబాబు’ చిత్రం అక్కడ 10 రోజులకు రూ . 2,33,901లక్షలను తో పాటు టోటల్ గా రూ . 31,61,587 లక్షల షేర్ ను రాబట్టింది.

సంబంధిత సమాచారం :