తమిళ స్టార్ హీరో ను డైరెక్ట్ చేయనున్న’ఆర్ఎక్స్ 100’డైరెక్టర్ !

Published on Jul 29, 2018 2:36 pm IST

కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి. నూతన నటి నటులతో ‘ఆర్ఎక్స్ 100’అనే యూత్ ఫుల్ ఎంటర్టైనెర్ ను తెరకెక్కించి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించాడు ఈ దర్శకుడు. ఇక ఈ సినిమా తరువాత ఆయనకు కొన్ని పెద్ద బ్యానర్ల లో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయట.

దాంట్లో భాగంగా బాలీవుడ్ నుంచి ఫాంథమ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ అధినేతలు అనురాగ్ కశ్యప్. మధు వంతెనలు నిర్మించనున్న కొత్త చిత్రానికి అజయ్ భూపతిని దర్శకుడిగా తీసుకోనున్నారని సమాచారం. అలాగే కోలీవుడ్ స్టార్ట్ హీరో ధనుష్ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా ఫై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తానికి ఒక్క సినిమా తో ఇటు తెలుగులోనే కాకుండా, కోలీవుడ్ , బాలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదిస్తున్నాడు అజయ్ భూపతి.

సంబంధిత సమాచారం :