మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తున్న ‘ఆర్ఎక్స్ 100’ !

మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తున్న ‘ఆర్ఎక్స్ 100’ !

Published on Jul 12, 2018 6:58 PM IST

rx 100 poster1
కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం “ఆర్ఎక్స్ 100” ‘ ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరి’ అనేది ఉప‌శీర్షిక. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రం పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ నే రాబట్టుకుంటుంది. సింగిల్ స్క్రీన్స్ లో అయితే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో “ఆర్ఎక్స్ 100” దూసుకెళ్తుంది.

ప్రధానంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ చిత్రానికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అజేయ్ భూపతి దర్శకత్వం, కార్తికేయ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో నటుడు రాంకీ, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు