ప్రమోషన్లను నమ్ముకున్న చిన్న సినిమా !

ప్రమోషన్లను నమ్ముకున్న చిన్న సినిమా !

Published on Jun 6, 2018 6:00 PM IST

సినిమా చిన్నదే అయినా అందులో డాషింగ్ కంటెంట్ ఉండి మంచి ప్రమోషన్స్ అందించగలిగితే ఆ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి ఉదాహరణగా ‘అర్జున్ రెడ్డి’ వంటి పలు సినిమాలున్నాయి. ఇప్పుడు అదే కోవలోకి వస్తోంది ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం. టైటిల్ తోనే భిన్నత్వాన్ని చాటుకున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది.

అందులోని కంటెంట్ చాలా ఇంటెన్సిటీతో కూడినదై ఉండటం వలన ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంది. ప్రధానంగా హీరో పాత్ర, హీరోయిన్ తో అతని లవ్ ట్రాక్ వంటివి యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో సినిమా టీమ్ ప్రమోషన్ల వేగాన్ని ఇంకాస్త పెంచింది. అందులో భాగంగా ఈరోజు సినిమాలోని ‘నిప్పై రగిలే’ పాటను విడుదల చేసింది. ప్రమోషన్లతో జనంలోకి వెళ్లేందుకు టీమ్ చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు ఒకొక్కటిగా సఫలమవుతున్నాయి.

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ భూపతి డైరెక్ట్ చేశారు. త్వరలోనే విడుదలకానున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు