‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ కు అదిరిపోయే బహుమతినిచ్చిన నిర్మాత !

Published on Aug 11, 2018 10:10 am IST

ఆర్ ఎక్స్ 100 చిత్రం తో ఓవర్ నైట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు అజయ్ భూపతి. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’.

ఇటీవల విడుదలైన ఈచిత్రం రూ. 11కోట్ల షేరును రాబట్టి సినిమా బడ్జెట్ కంటే నాలుగింతల కలెక్షన్స్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్ర విజయానికి కారణమైన అజయ్ భూపతికి ఈ చిత్ర నిర్మాత అశోక్ గుమ్మకొండ జీప్ కార్ ను బహుమతిగా ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :

X
More