విషాదం..”సాహో” బాలీవుడ్ నటి భర్త మృతి.!

Published on Jun 30, 2021 12:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లాస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “సాహో” లో అనేక మంది బాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ నటులు కూడా నటించిన సంగతి తెలిసిందే. మరి వారిలో ఈ చిత్రంలో కల్కి అనే కీలక పాత్రలో నటించిన మందిరా బేడీ భర్త మరణించారు అనే వార్త బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

అయితే ఇంకా లోతు వివరాల్లోకి వెళితే మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ ఓ ఫిల్మ్ మేకర్ కూడా.. మరి అయన ఈరోజు ఉదయం తెల్లవారు జాము 4 గంటల 30 నిమిషాల సమయంలో తన నివాసంలోనే ఆకస్మిక గుండెపోటు వచ్చిన కారణంగా తన 50వ ఏట కన్నుమూశారు. దీనితో మందిరా బేడీ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఈ విషయం తెలిసిన వారి సన్నిహితులు వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెబుతున్నారు. అయితే షాదీ కా లడ్డు, ప్యార్ మైన్ కభీ కభీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించగా మరిన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మరి అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ప్రగాఢ సంతాపం తెలుపుతుంది.

సంబంధిత సమాచారం :