ఆ ఛాలెంజింగ్ రోల్ లో “సాహో” బ్యూటీ.?

Published on Aug 15, 2020 4:43 pm IST

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రద్దా కపూర్ మన తెలుగు ఇండస్ట్రీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో” తో పరిచయం అయ్యింది. అక్కడ నుంచి మన వాళ్లకు కూడా బాగానే దగ్గరైన ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఒక బోల్డ్ అటెంప్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

గత అమలాపాల్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “ఆమె” తమిళ్ లో “ఆడాయ్” గా తెరకెక్కి తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో అమలాపాల్ చేసిన రోల్ చాలా ఛాలెంజింగ్ అండ్ బోల్డ్ గా ఉంటుంది. పోస్టర్స్ తోనే అప్పట్లో హైప్ రేపిన ఈ చిత్రం రీమేక్ లో నటించేందుకు శ్రద్దా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి శ్రద్దా ఈ రోల్ ను ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి. ఇంకా ఈ చిత్రంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More