అక్కడ సాహో వసూళ్లు స్టడీగా ఉన్నాయి.

అక్కడ సాహో వసూళ్లు స్టడీగా ఉన్నాయి.

Published on Sep 5, 2019 11:29 AM IST

తెలుగు రాష్ట్రాలలో సాహో వసూళ్లు నెమ్మదించాయి. సెలవుదినముల అనంతరరం సాహో వసూళ్ళలో చెప్పుకోదగ్గ డ్రాప్ కనిపించింది. ఇది ఒకింత బయ్యర్లను కలవరపెట్టే అంశమే. ఐతే హిందీ వర్షన్ మాత్రం స్టడీగా వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు 24.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన సాహో వరుసగా 25.20కోట్లు,, 29.48కోట్లు, 14.20 కోట్లు, 9.10కోట్ల వసూళ్లు సాధిచింది. ఇక ఆరవ రోజైన బుధవారం 6.90 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇక మొత్తంగా హిందీ వర్షన్ 109.28 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది అబ్బురపరిచింది.

రెండవారం ముగిసేనాటికి సాహో బ్రేక్ ఈవెన్ చేరుకొనే అవకాశం కలదని ట్రేడ్ వర్గాల అంచనా. దీనితో సాహో హిందీ బయ్యర్లకు రెండవ వారం నుండే లాభాలు పంచనుంది. గతవారం పోటీలేకుండా సోలోగా విడుదలైన సాహోకి మాత్రం ఈ వారం శ్రద్దా కపూర్ నటించిన ఛిచ్చొరే మూవీ నుండి పోటీ ఎదురుకానుంది. దంగల్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ చిత్రంపై బాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు