ప్రభాస్ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో తెలుగులో పాటు సౌత్ ఇండియాలో ఆశించినంత విజయం సాధించకపోయినా నార్త్ ఇండియాలో విశేష ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సాహో హిందీ వర్షన్ తెలుగుకు మించి 150కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన సాహో చిత్రానికి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలలో సాహో రికార్డు కలెక్షన్స్ సాధించిందని సమాచారం.
ఒరిస్సా రాష్ట్రంలో బాహుబలి 2 తరువాత అంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సాహో నిలిచింది. కాగా బీహార్ లో కూడా సాహో చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. బీహార్ లో సాహో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 6వ స్థానం దక్కించుకుంది. సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ అయిన భజరంగి భాయ్ జాన్, సుల్తాన్ అలాగే అమీర్ ఖాన్ పీకే, రణ్వీర్ సింగ్ నటించిన సింబా చిత్రాలను అక్కడ సాహో అధిగమించడం గమనార్హం.
ప్రభాస్ తన తదుపరి చిత్రం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో చేస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. జాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.


