సాహో వలన ప్రభాస్ కి మేలే జరిగింది…!

Published on Sep 17, 2019 6:57 am IST

సాహో విడుదలై ఇప్పటికి దాదాపు మూడు వారాలు కావస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లో సాహో కథ ముగిసినట్లే లెక్క. సాహో చాలా చోట్ల భారీ నష్టాలను మిగల్చగా కొన్ని ఏరియాలలో నామమాత్రపు నష్టాలతో బయటపడ్డారు. ఐతే సౌత్ కి భిన్నంగా సాహో నార్త్ ఇండియా లో విజయబావుటా ఎగురవేసింది.

సాహో హిందీ వెర్షన్ 150కోట్ల వసూళ్ళ దిశగా దూసుకుపోతుంది. ఈ వసూళ్ల రీత్యా సాహో క్లియర్ హిట్ గా చెప్పుకోవచ్చు.అలాగే ప్రభాస్ కి ఏమికావాలో అదే సాహో ద్వారా అందింది. ఎందుకంటే తెలుగులో సాహో విఫలం చెందడం వలన ప్రభాస్ ఇమేజ్ కి ఆయన క్రేజ్ కి వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ హిందీలో సాహో ఫెయిల్ అయితే ఆయనకు భారీ నష్టం చేకూరేది.

సాహో విజయం ప్రభాస్ బాహుబలి ప్రభంజనాన్ని, ఆ విజయం వలన వచ్చిన ఇమేజ్ ని బాలీవుడ్ లో కొనసాగేలా చేసింది. బాలీవుడ్ లో ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉందన్న విషయాన్ని సాహో నిరూపించింది. కాబట్టి ప్రభాస్ నేషనల్ స్టార్ అన్న హోదా సాహో విజయం స్పష్టం చేసింది. కాబట్టి సాహో వలన ప్రభాస్ కి మేలు జరిగినట్లే లెక్క.

సంబంధిత సమాచారం :

X
More