‘సాహో’ మా చిత్రం – నాని

Published on Aug 8, 2019 3:20 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రం విడుదల తేదీ సెప్టెంబర్ 13కి మారిందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వాయిదాని నాని ట్విట్టర్‌ లో ధృవీకరిస్తూ, ‘గ్యాంగ్ లీడర్ కొత్త విడుదల తేదీని రేపు ప్రకటిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా బజ్ ఉన్న ‘సాహో మా చిత్రం’ అని, ప్రభాస్ అన్నకి అండ్ సాహో టీం మొత్తానికి తన విషెస్ తెలుపుతూ.. ఆగష్టు 30న సాహో విజయం మా వేడుకగా మారుతుందని..’ నాని పోస్ట్ చేశారు.

ఇక గ్యాంగ్ లీడర్ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయని సమాచారం. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :