రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Aug 14, 2019 12:23 pm IST

సాహో యూనిట్ మరో ఆసక్తికర అప్డేట్ తో ఫ్యాన్స్ ముందుకి వచ్చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, వెన్యూ ప్రకటించేశారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఈనెల 18న సాయంత్రం 5గంటల నుండి భారీగా ఏర్పాటు చేసిన వేదిక పై సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేదికపై ఈవెంట్ కి హాజరైన అభిమానుల కొరకు సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఆహ్లాదం కలిగించే ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తుంది. హీరో ప్రభాస్,హీరోయిన్ శ్రద్దా కపూర్ లతో పాటు,నిర్మాతలు, చిత్రంలో నటించిన వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులతో పాటు, టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.

ఐతే ఎంతో ఆర్బాటంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎవరు వస్తారు అనేది చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. సాహో మూవీ దేశమలోని నాలుగు ప్రధాన భాషలైన హిందీ,తమిళ్,తెలుగు,మలయాళ భాషలలో ఈ నెల 30న విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :