గడ్డ కట్టించే ఆల్ఫ్స్ పర్వతాలలో “సాహో” టీం…!

Published on Jun 27, 2019 11:22 am IST

టీజర్ విడుదల తరువాత దేశవ్యాప్తంగా “సాహో” పై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుజీత్ ఈ మూవీ ని హాలీవుడ్ స్థాయిలోతెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు15న విడుదల కానున్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి ఇంకా 50రోజులే మిగిలివుంది.

టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసిన చిత్ర బృదం ప్రభాస్,శ్రద్దా కపూర్ లపై పాటల చిత్రీకరణ కొరకు ఆస్ట్రియా వెళ్లిన విషయం తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రియా దేశంలో గల ఆల్ఫ్స్ పర్వతాలలో ప్రభాస్,శ్రద్దా పై ఓసాంగ్ చిత్రీకరిస్తుందట చిత్ర బృదం. మంచు పర్వతాలలో హీరో హీరోయిన్ మధ్య నడిచే ఈ రొమాంటిక్ సాంగ్ అద్బుతంగా ఉంటుందట.

పాటల చిత్రీకరణ పూర్తయిన వెంటనే దర్శకుడు సుజీత్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసేపనిలో నిమగ్నమౌతారట. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో మురళీ శర్మ,వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా,జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తునారు.

సంబంధిత సమాచారం :

More