దర్శకుడు హరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విక్రమ్, త్రిషలు జంటగా 2003లో వచ్చి ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘సామి’. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా, విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘సామీ స్క్వేర్’ విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో హరి మార్క్ డైరెక్షన్ చూపిస్తే, పరుశురామ స్వామిగా విక్రమ్ ఫుల్ యాక్షన్ చుపించేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ చిత్రం పై తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ పోలీస్ యాక్షన్ డైరెక్టర్ ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాలి.
ఇక ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్లు కూడా ప్రారంభమైయాయి. ఈ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు.
