తను క్రికెట్ గ్రౌండ్ లో దిగాడు అంటే పరుగుల వరదే, సెంచురీల విషయానికి వస్తే రికార్డుల మోతే, అంతటి ఊరుకోకుండా డబుల్ సెంచురీ అనే దానికి క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆయనెవరో కాదు ఇండియన్ క్రికెట్ టీంలో ఓ వెలుగు వెలిగిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ ఇటీవలే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. భారదేశం మొత్తం ఎంతో మంది అభిమానులు ఉన్న సచిన్ త్వరలో ఓ సినిమాలో కనిపించబోతున్నాడు. అది కూడా సచిన్ పై తీయబోయే ఆటో బయోగ్రఫీ సినిమాలో తనే నటిస్తుండడం విశేషం..
అవార్డు విన్నింగ్ బ్రిటిష్ డైరెక్టర్ జేమ్స్ ఏర్స్కినే డైరెక్ట్ చేయనున్న సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ‘200 నాటౌట్’ అనే బ్యానర్ పై ఓ ముంబై ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించనున్నారు. వీళ్ళు వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ నుంచి ఈ సినిమా చేయడానికి రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా విశేశాలకి వస్తే .. టెండూల్కర్ జీవితం ఆధారంగా టెండూల్కర్ నటిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. సినిమా రన్ టైం 90-120 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమాని ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసే ఆలోచనలో ప్రొడక్షన్ టీం ఉంది. మరి కేరికేట్ నుంచి తప్పుకున్న సచిన్ తన సినిమాతో ఎంతవరకూ తన అభిమానులను మెప్పిస్తాడో చూడాలి.
