విషాదం: అల్లరి నరేష్ ఇంట విషాదం!

naresh

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. కామెడీ సహా మంచి హార్డ్ హిట్టింగ్ సబ్జెక్టు లతో వస్తున్న అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. కొన్నాళ్ల కితం అల్లరి నరేష్ తండ్రి ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యన్నారాయణ కాలం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వారి తండ్రి అంటే నరేష్ తాతయ్య ఈదర వెంకట్రావు గారు కన్ను మూశారనే విషాద వార్త బయటకి వచ్చింది.

వయస్సు సంబంధ కారణంతో వెంకట్రావు గారు తన 90వ ఏట ఈ జనవరి 20 తెల్లవారు 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారట. వీరికి నలుగురు సంతానం కాగా ముగ్గురు కొడుకులు ఒక కూతురు. వీరిలో పెద్ద కొడుకు ఈవీవీ సత్యన్నారాయణ. మరి వీరి మరణ వార్తతో నరేష్ ఇంట విషాదం నెలకొంది. ఈరోజు నిడదవోలు మండలం కోరుమామిడిలో సాయంత్రం 4 గంటలకి కుటుంబీకులు అంత్యక్రియలు జరపనున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

Exit mobile version