దక్షిణాది సినిమా దగ్గర తమ సినిమాలతో ఎంతో ప్రభావం చూపించిన వెటరన్ దర్శకుల్లో తమిళ పాపులర్ దర్శకుడు భారతీ రాజా కూడా ఒకరు. తన ‘సీతాకోక చిలుక’ సినిమా కోసం ఇప్పటికీ ఆడియెన్స్ మాట్లాడుకుంటారు. అలాంటి సినిమాలు ఎన్నో తమిళ్ తెలుగు భాషల్లో అందించిన ఈ సీనియర్ దర్శకుడు ఇపుడు ఇక లేరు అనే విషాద వార్త సినీ వర్గాల్లో త్రీవ్ర విషాదాన్ని నింపింది.
1941 జూలై 17న జన్మించిన భారతీ రాజా తన 84వ ఏట వయసు సంబంధిత సమస్యలు రీత్యా తుది శ్వాస విడిచిన వార్త అందరినీ దిగ్భ్రాంతికి లోను చేసింది. ఎర్ర గులాబీలు, ఆరాధన, జమదగ్ని, సీతాకోక చిలుక వంటి సినిమాలు తెలుగులో తీశారు. తమిళ్ లో కూడా ఎన్నో సినిమాలు చేయగా అవి కూడా తెలుగులో డబ్బింగ్ అయ్యి హిట్ అయ్యినవి కూడా ఉన్నాయి. కానీ వీరిపై ఇలాంటి వార్త విన్న సినీ ప్రముఖులు ఇపుడు సోషల్ మీడియాలో తమ విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి భారతీ రాజా గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు టీం ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.


