జాతిరత్నాలు కోర్ట్ సీన్ యాదుందా.. సద్దాం దించేశాడు.!

Published on Jun 30, 2021 1:39 am IST


తెలుగు బుల్లితెర‌పై ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే షోల‌లో స్టార్ మాలో వస్తున్న “కామెడీ స్టార్స్” కూడా ఈ మధ్య కామెడీ ఆస్వాదించే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జాతి రత్నాలు సినిమా అందరికి గుర్తుంది కదా.. ముఖ్యంగా ఈ సినిమాలో కోర్టు సీన్ మాత్రం హిలేరియస్ అనే చెప్పాలి. సినిమా చూసినోడు ఎవరు ఆ సన్నివేశాన్ని మరిచిపోరు. ఎందుకంటే జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) జడ్జ్ ముందు అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాకుండా కామెడీనీ పండించాడు.

అయితే అలాంటి కామెడీనీ సద్దాం ఈ ఆదివారం స్టార్ మాలో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు వచ్చే “కామెడీ స్టార్స్”లో చూపించి మనల్ని నవ్వించబోతున్నాడు. భూమి మీద నుంచి నరకానికి వెళ్లిన సద్దాం అక్కడ యమధర్మ రాజుతో తన కష్టాలన్నిటిని చెప్పుకున్నాడు. అయితే అది చూడ్డానికి అచ్చం జాతి రత్నాలు సినిమాలోని కోర్ట్ సీన్‌లాగా ఉండడంతో నవీన్ పోలిశెట్టి డైలాగులను గుర్తుతెచ్చింది. అయితే అది ఎలా ఉండబోతుందో ప్రస్తుతానికి ఈ ప్రోమోను చూసి తెలుసుకోండి.

సంబంధిత సమాచారం :