జనవరిలో చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’

జనవరిలో చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’

Published on Nov 22, 2015 12:38 PM IST

Naga-Chaitanya
నాగ చైతన్య హీరోగా క్లాస్ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే ఓ కూల్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాకు మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో గౌతమ్ మీనన్ తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరించగా, తాజాగా సినిమా యూనిట్ మరో కొత్త టీజర్‌తో సిద్ధమైపోయింది.

నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్‌ను విడుదల గౌతమ్ మీనన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ స్పష్టం చేశారు. ఇక చైతూ పుట్టినరోజు సందర్భంగా రేపు కొన్ని స్పెషల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

తాజా వార్తలు