‘సాహెబా సుబ్రహ్మణ్యం’కి ‘యు’ సర్టిఫికేట్

Saheba
గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా అలరిస్తున్న ఎంఎస్ నారాయణ కుమార్తె శశి కిరణ్ దర్శకురాలిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. ఈ సినిమా చాలా రోజుల క్రితం పూర్తయినప్పటికీ చిన్న సినిమా కావడం వలన సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్ర టీం ఈ సినిమాని డిసెంబర్ 13న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు.

దాంతో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా అపూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ లవ్ స్టొరీకి ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా రోజుల క్రితం షాన్ రెహమాన్ అందించిన ఆడియో రిలీజ్ అవ్వడమే కాకుండా, ఆడియోలో అన్నీ మెలోడీ సాంగ్స్ ఉండడం వలన అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘తట్టతిన్ మరయతు’ సినిమాకి రీమేక్. దిలీప్ కుమార్ – ప్రియల్ గోర్ హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి కొల్ల నాగేశ్వరరావు నిర్మాత.

Exit mobile version