కబీర్ సింగ్ ని బీట్ చేయాలంటే సాహో రావలసిందేనంట…!

Published on Jun 24, 2019 8:00 pm IST

షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెలుగు మూవీ “అర్జున్ రెడ్డి” కి హిందీ రీమేక్ గా తెరకెక్కిన “కబీర్ సింగ్” బాలీవుడ్ లో కూడా సంచలన విజయం వైపుగా దూసుకుపోతుంది. క్రిటిక్స్ ఈ మూవీపై పెదవి విరిచినా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. విడుదలైన మొదటిరోజు కంటే రెండవ,మూడవ రోజు వసూళ్లు అధికంగా ఉండడం గమనార్హం.

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రోహిత్ జైస్వాల్ ఈ మూవీ కలెక్షన్స్ ని ఉద్దేశిస్తూ ‘కబీర్ సింగ్’ కలెక్షన్స్ బీట్ చేయాలంటే ‘సాహో’ మూవీ రావలసిందే, రాబోయే ఒకటి రెండు నెలల్లో ముఖ్యంగా హిందీలో ‘కబీర్ సింగ్’ కలెక్షన్స్ క్రాస్ చేసే సినిమాలేవీ లేవు అన్నారు. మరో విశేషం ఏమిటంటే ‘సాహో’ మూవీ కలెక్షన్స్ ని ప్రస్తావిస్తూ మూవీ కనుక ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్స్ మాత్రం భారీగా ఉంటాయి అని ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More