‘సాహో’ సినిమానే ముందుగా రిలీజవుతుందట !

20th, March 2018 - 08:38:43 AM

ప్రభాస్ ఒకవైపు హై యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ చేస్తూనే మరోవైపు త్వరలో మొదలుపెట్టనున్న రొమాంటిక్ ఎంటరటైనర్ పనుల్ని కూడ వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా
‘సాహో’ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కానున్నాయని, అందుకే కృష్ణం రాజు యొక్క గోపికృష్ణ బ్యానర్లో జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన కొత్త సినిమా ముందుగా రిలీజవుతుందని వార్తలు పుట్టుకొచ్చాయి.

కానీ అలాంటిదేం లేదని ప్లాన్ ప్రకారమే ‘సాహో’ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేస్తారని, ఆ తర్వాత రోమాంటిక్ ఎంటర్టైనర్ బయటికొస్తుందని తెలుస్తోంది. అంతేగాక ఈ రెండు చిత్రాలు కొద్ది గ్యాప్లో సిద్దమైపోతాయని కూడ అంటున్నారు. ఇకపోతే పూజ హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ జూలై నుండి మొదలుకానుంది.